in ,

పొదుపు

నేను బాగా పొదుపు చేస్తాను . ఒక రకంగా పీనాసి అనుకున్నా ఫర్వాలేదు . ఇంట్లో వాళ్ళు గుమ్మ డికాయలు పోతున్నా  పట్టుకోవు , ఆవాల కోసం ఏడుస్తావు – అని విసుక్కుంటారు.

అసలు నేను చేసే పొదుపు గురించి చెపుతాను . చిన్నపుడు నోట్స్ లో మిగిలిన పేజీ లను చింపి , కుట్టి ,  రఫ్ గా వాడేవారు . అదే అలవాటు అయ్యింది. కాలేజ్ లో ఎలక్షన్ పాంఫ్లెట్ లు ఒక వైపు ఖాళీ గా ఉంటే , వాటిని స్టాప్లర్ తో పిన్ చేసి , రఫ్ గా వాడే దాన్ని .

ఇప్పుడు న్యూ స్ పేపర్ తో అడ్వటైజింగ్ పాంఫ్లెట్ లు వేస్తే , వాటిని , పిల్లల స్కూల్ నుండి వచ్చే నోటీసులను  ,  చక్కగా కట్ చేసి , పిన్ చేసి , పాకెట్ బుక్  చేసుకుంటాను .  దాంట్లో ఫోన్ నెంబరు , పాల లెక్కలు , ఇంటి ఖర్చు ల లెక్కలు , సరుకుల లి స్టు లు ,  ఆదాయం , ఖర్చు లు , జమా లెక్కలు – ఇలా రాసు కుంటాను .

మరీ పేపర్ కోసం ఇంత పీనాసి తనం ఎందుకు? డబ్బు పెట్టి  లెడ్జర్  బుక్ కొనుక్కో వచ్చు కదా – అని అడిగారు. నేనేమైనా ఇన్ కం ట్యాక్స్ ఫైల్ చేయాలా. ఉచితంగా పేపర్ వస్తుంది . ఏదో పనికి రాని లెక్కలు చేస్తాం . దానికి , డబ్బు పెట్టి కొత్త పుస్తకం అవసరమా ?

కానీ పిల్లలు నన్ను ఇలా ఎందుకు మాటలు పడతావు ? కావాలంటే నా నోట్స్ ఒకటి తీసుకో , అందరూ నోరు మూ స్తా రు , అన్నారు. వేలు పోసి కొన్న పుస్తకాలు , ఊరికే ఎలా వాడతాను . దాంతో పిల్లలు అసలు నీకు ఎందుకు అంత పీనాసి తనం , మా కోసం వేలు పెట్టి కొం టా వు , నీవు కొనుక్కో వు – అని, నిలదీశారు .

దాంతో అసలు విషయం వివరించాను . పేపరు తయారీ  చేయడానికి చెట్లను కొ ట్టే స్తా రు . వాటిని నరికి , కాగితం గా తయారు చేయ డానికి నీరు , కరెంట్  –  వాడతారు . చెట్లు నరికితే వాయు కాలుష్యము , నీటి కాలుష్యము , కరెంట్ కోసం బొగ్గు తగలేసి వాయు కాలుష్యం – ఇలా అడుగు అడుగునా కాలుష్యమే .

హాస్టల్ లో ఉన్నపుడు , వాన పడి , చక్కగా ఎంజాయ్ చేస్తుంటే, పేపర్ మిల్లు గ్యాస్ వది లేశే వాడు . మంచి మూడ్ పాడ య్యేది .  చివరకు క్యాబేజి కూర కు పేపర్ మిల్  అని నామకరణం చేశారు .

అసలే నేను అందరిలా దుబారా గా ఉండేదాన్ని .కానీ మాష్టారు , నన్ను పర్యావరణం క్లబ్ లో జాయిన్ చేసి, కాలుష్యం గురించి వివరంగా చెప్పి , ఇండస్ట్రీ లకి  తీసుకుని వెళ్లి , కాలుష్యాల గురించి వివరంగా చూపించారు . దాంతో మార్పు మొదలై నది . కనీసం నేనైనా , నాకు చేతనైనంత పొదుపు చేస్తే , కనీసం ఒక మొక్క నైనా బతికించి నట్లవు తుందని , కాలుష్యం తగ్గుతుందని , ఇలా పొదుపు చేస్తున్నాను – అని వివరించాను.

దాంతో మా పిల్లలు ఎక్కడ పేపర్ ఉన్నా ,  తెచ్చి , వాడు కోమని ఇస్తారు. వారు కూడా పాత నోట్స్ లో , మిగిలిన పేపర్ లో రఫ్ వర్క్ చేస్తున్నారు.అమీర్ పేట వెళితే , అసలు రోడ్డుమీద పాంఫ్లెట్ లను చూస్తే , ఎన్ని చెట్లు నరికారో నని భాదవేస్తుంది.

తా చెడ్డ కోతి వనమెల్లా చెరి చిందన్నట్టు ,ఈ వ్యాసం చదివిన వారు , నాలా పొదుపు పాటిస్తే , ప్రకృతికి మేలు చేసిన వారవుతారు .

ఆఖరున మా వాళ్ళు నోరు మూయడానికి నేను చెప్పే దేమిటంటే- గుమ్మడి కాయలు బరువుంటాయి, చేతులు నొప్పి పుడతాయి . ఆవాలు తేలికగా ఉంటాయి . ఈజీ గా క్యాచ్ చేయొచ్చు – అని. కాదంటారా?

Report

What do you think?

98 Points
Upvote Downvote

Comments

Leave a Reply

Loading…

Loading…

0

యోగవాసిష్ఠం

సొరకాయ