in ,

క్షవరం

గాంధీ గారు స్వయంగా జుట్టు కత్తిరించుకుని, అందరిలో నవ్వులపాలు తయారు. కానీ విషయం తెలుసుకున్న తర్వాత ఆయనను శభాష్ అన్నారు.

జుట్టుచిట్లినదని, చివర్లు ట్రిమ్ చేస్తుంటే చూసి న పిల్లలు, మాకు జుట్టు కత్తిరించమని, గొడవ మొదలుపెట్టారు. వాళ్ళని కేకలేసాను. అలిగిన కూతురు, తనే కత్తెర తీసుకుని, జుట్టు కత్తిరించుకుంది.

బంగారం లాంటి జుట్టు, మోచేయంత పొడవు, కట్ చేస్తే, నా మనసు విలవిల లాడింది. ఏం చేయగలను. ఉన్నవాడికి విలువ తెలియదు, లేనివాడికి దొరకదు. మంచివత్తైన జుట్టు, అద్రృష్టం అనుకుంటే, బరువుగా ఉంది, జడవేయడం బద్దకమేసి, కట్ చేసింది. చెప్పొద్దు, బాబ్ లో కూడా పిల్ల చాలా ముద్దుగా ఉంది. గట్టిగా ఏమన్నా అందామంటే, పబ్లిక్ పరీక్షల్లో ప్రతాపం చూపుతుంది. అందుకని, నాలుగు రోజులు మాట్లాడటం మానేశా. మూడేళ్ళు గడిస్తే మళ్ళీ జుట్టు వస్తుంది. కానీ మార్కులు ఒకసారే వస్తాయి.

దీన్ని అలుసుగా తీసుకుని,మా పిల్లాడు తనకు క్రాఫ్ చేయమని గొడవ మొదలెట్టాడు. షాప్ కి తీసుకెళ్ళి క్రాఫ్ చేయించినా, నచ్చలేదు, నీవు కట్ చేయమని, ఒకటే గొడవ. భరించలేక, ఇష్టం మొచ్చినట్టు,ఎడాపెడా కత్తిరించా.

వానకు, గుంటలు తేలిన తారు రోడ్డు లా తయారైంది వాడి తల. ఎగుడు, దిగుడు, గుంటలు, మధ్యలో కొత్తిమీర కట్టలు. ఇక సునామీ మొదలు. అక్కకు బాగా చేశావు, నాకిలా చేశావు అని. ముందే చెప్పాను కదా, నాకు రాదని, అయినా వినలేదు, అన్నా.

ఈ లో పల ఇంట్లో వాళ్ళు కేకలేశారు. చక్కగా ఉన్న క్రాఫ్ని నాశనం చేశావు. చిన్నవాడు, వాడికి తెలీదు,పెద్దదాని వి,నీకు బుద్ధి ఉండవద్దా,అని. చివరకు అందరూ కలిసి, గుండు గీయమన్నారు.

మంగలి పని నాకెలా వస్తుంది. దానికి ఎంత నైపుణ్యం కావాలో. దిగితే కానీ లోతు తెలీదు. మొత్తానికి అష్టకష్టాలు పడి,మా వాడికి గుండు కొట్టాను. వాడికీ హాయిగా ఉంది. బయటకు వెళ్ళే పని లేదు. ఏ టైములో కావాలంటే, ఆ టైములో కట్ చేసుకోవచ్చు. ఎలర్జీలు రావు. ఎందుకంటే ఒకసారి ఎలర్జీ వస్తే, వైద్యానికి వేయి రూపాయలు ఖర్చు అయింది.

ఒకసారి గుండు చేస్తే, మూడు నెలలు హాయిగా ఉంటుంది. ఇక మా వాడు, జుట్టు పెరగగానే, సతాయించి, గుండు చేయించుకుంటున్నాడు. ఇరుగు, పొరుగు కి విషయం తెలిసి, నవ్వుకోసాగారు. బంధువులు గుంభనంగా, నీ హెయిర్ స్టైల్ ఎవరు చేశారు, బాగుంది, అని అడిగేవారు.

మా అక్క బాధపడి, హెయిర్ ట్రిమ్మింగ్ ఒకటి కొనిచ్చింది.దాంతో ఈజీ అయ్యింది. కట్ చేసినంత చేసి, ట్రిమ్ చేస్తున్నా. మా వాడు ఫ్రెండ్స్ కి, టీచర్లకీ మా అమ్మే గుండు చేస్తుంది అని చెప్పే డు. ఎవరు ఎగతాళి చేసినా, నవ్వినా, మేము దొంగ తనం చేయలేదు, దోపిడీ చేయలేదు. మా పని మేం చేసుకున్నాము. ఎవరికీ హాని కలుగలేదు. సిగ్గెందుకు పడాలి? పాపం చేస్తే, తప్పు చేస్తే భయపడాలి. అందుకని ప్రతీ మూడు నెలలకు హాయిగా గుండు చేస్తున్నా.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్విన నాపచేను పండుతుంది. కరోనావచ్చి, క్షవరశాలలు మూతపడ్డాయి. ఇరుగు పొరుగు ఇళ్ళలో, గడ్డాలు, మీసాలు, పొడవు జుట్టు లతో మునులు, మహర్షులు తయారయ్యారు. ఇక వారు భార్యలను ఆడిపోసుకోవడం మొదలెట్టారు. నీకన్నా పక్కింటామె నయ్యం. చక్కగా గుండు చేస్తుంది. నీకు చాతకాదు, పైగా ఆవిడను ఎగతాళి చేస్తావా? ముందు క్రాప్ చేయి, తర్వాత నవ్వుకోవచ్చు -అని.

తండ్రీకోడుకు ఉన్న ఇళ్ళలో, ఒకరికి ఒకరు క్షవరం చేసుకుంటున్నారు. కూతుళ్ళు ఉన్న ఇంట్లో, కూతురిని బతిమాలి, చేతిలో డబ్బు పెట్టి మరీ, కూతురితో క్షవరం చేపించుకుంటున్నారు.

ఎలాగూ స్కూల్ తెరవడం లేదు కదా, చక్కగా జుట్టు పెంచుకో, పిలకవేసి, నెమలి ఈక పెట్టుకుని, చిన్ని క్రిష్ణుడు లా అలంకరిస్తా, అని అడిగితే, మా వాడు సరే నున్నాడు. ఊరందరిదీ ఒకదారి, ఉలిపిరి కొట్టది ఒకదారి. అందరూ షాపులో క్షవరం చేయించుకుంటే, నేను ఇంట్లో చేశాను. అందరూ ఇంట్లో చేసుకుంటుంటే, మేమొ మొత్తానికి మానేశాము.

ఆఖరుకు చెప్పొచ్చేదేమిటంటే, న్యాయబద్ధంగా, ధర్మయుతంగా జీవించే వారిని ఎగతాళి చేస్తే, ప్రక్రృతి అవే పరిస్థితులను ఎగతాళి చేసినవారికి కల్పిస్తుంది. అందుకే చెడపకురా చెడేవు-అన్నారు పెద్దలు.

Report

What do you think?

Comments

Leave a Reply

Loading…

Loading…

0

Allu Arjun and the word Chalo in his songs

నానావతి కేసు