1980-2000 లలో ఏప్రిల్ ఫూల్ బాగా చేసేవారు. రోడ్డుమీద వెళ్ళే వార్ని ఫూల్ చేసి,గుర్తుగా ఇంక్ చల్లేవారు.ఇప్పుడు అన్నీ బాల్ పెన్నులే.ఈ తరం వారికి ఇంకుపెన్ను తెలియక పోవచ్చు.
ఏప్రిల్ ఫూల్ డే నాడు,బయటికి వెళ్ళే వాళ్ళం కాదు.ఒకవేళ వెళ్ళినా పాత బట్టలు వేసుకునేవారు.ఎవరు పిలిచినా పలికే వారం కాదు.కానీ డ్రెస్ చిరిగింది,లేదా తేలు కాలి దగ్గర ఉంది-అంటే చటుక్కున తిరిగి, ఫూల్స్ అయ్యే వారం.
ఇప్పటికీ ఇంట్లో తప్పకుండా ఏప్రిల్ ఫూల్ చేసుకుంటాము.బెల్ కొట్టి ఎవరో వచ్చి నట్టు , ఫోన్ వచ్చిందనో-ఇలా ఏదో ఒకటి చెప్పి ,చిన్న- పెద్ద- అందరూ, ఏప్రిల్ ఫూల్ చేసుకుంటాము.
కానీ ఒక ఏప్రిల్ ఫూల్ మాత్రం చాలా బాగా గుర్తుంది .ఎందుకంటే మనిషి తన చేతిలో, తనే ఏప్రిల్ ఫూల్ కారు. మా అక్క, తన చేతిలో,తనే ఏప్రిల్ ఫూల్ అయింది .అదికూడా ఏప్రిల్ ఫూల్ డే నాడు.
ఆర్ధ రూపాయి, పావలా కే చందమామ, డిటెక్టివ్ బుక్స్ ,జాబిల్లి కథలు, చిన్న చిన్న పుస్తకాలు, కొనుక్కునే అలవాటు ఉంటుంది. అలా కొన్న వాటిమీద పేరు రాసుకుంటాం అయితే అప్పుడప్పుడు తమాషాకి ఒకటో పేజీలో పదో పేజీ చూడండి -అని, పదో పేజీలో ఇరవై పేజీ చూడండి,ఇరవై పేజీ లో ముప్పై చూడండి-ఇలా పుస్తకం చివర, నా పేరు మంజుల అని రాసుకుంటాం.
చిన్నప్పుడు పుస్తకాలన్నీ ఒకసారి అలమరా దులుపుతూ చూసాం. అలాగే ఒక పుస్తకంలో పదో పేజీ చూడండి అని ఉంది. మా అక్క సరదాగా ఉంటుంది కదా అని ,అది చెప్పినట్లు పేజీలన్నీ తిరిగేస్తూ చూసింది .ఆఖరి పేజీ లో ఏప్రిల్ ఫూల్ అని ఉంది .ఆరోజు ఏప్రిల్ ఫస్ట్.
ఆ రోజు ఎంత ట్రై చేసినా ,మా అక్క ని ఎవరూ ఫూల్ చేయలేకపోయారు. దాంతో మా అక్క కి చాలా గర్వంగా ఉంది. ఆ సమయంలో ఈ పుస్తకం కనిపించింది .నా పేరే ఉంటది కదా, అనుకుని వెళ్లి తీసింది .చివరికి అక్కడ ఏప్రిల్ ఫూల్ అని ఉన్నది.
తర్వాత, తనకి గుర్తొచ్చింది ఇంట్లో వాళ్ళని ఫూల్ చేయడం కోసం, తను ఆ పుస్తకంలో ,ఏప్రిల్ పూల్ అని రాసిందని. కానీ పదేళ్ల తర్వాత తనే ఆ పుస్తకం చదివి ఫూల్ అయింది. ప్రతి ఏప్రిల్ ఫూల్ నాడు ఈ సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాం.
Comments
Loading…
Loading…