in ,

నల్గొండ ట్రెక్కింగ్

మా నాన్న గారు నల్గొండ లో ఉద్యోగం చేస్తున్నారు. మేము సెలవులకు హాస్టల్ నుండి ఇంటికి నల్గొండ వెళ్ళాము.

హాస్టల్ లో నీళ్ళు మోసుకుని, బట్టలు ఉతుకుంటూ, సరైన తిండి లేక, బక్క చిక్కి ఇంటికి వెళితే, మా నాన్న, సాయంత్రం షికారు కెళ్ళాలి, రెడీగా ఉండమన్నారు.

కారులో షికారు, హాయి అనుకున్నాము. మొదటి రోజు చక్కగా రెడీ అయ్యాము. కొండమీద శివుని గుడి అన్నారు. పూజా సామాను తీసుకుని, చక్కగా కారెక్కాము. కారు చెరువు గట్టు, జడల రామలింగేస్వర స్వామి గుడికి వెళ్ళింది.

కింద ఒక గుడి , పైన ఇంకొటి . కింద పూజారి ముందు పై గుడి కి వెళ్ళమన్నారు. పైకి కారులోనే కదా అనుకున్నాము. కానీ మెట్లు మీద వెళ్ళాలి. చచ్చి నట్టు, మెట్లు ఎక్కి, స్వామికి పూజ చేసుకుని , కింద గుడి లో స్వామి దర్శనం చేసుకొని, ఉసూరుమంటూ ఇంటికి చేరాం .

రెండో రోజు, దర్గాకు పంపారు . అక్కడ నడిచీ, నడిచీ వెళ్ళాం. మధ్యలో చెట్టు తొర్ర ఒకటి ఉంది. అందులో వీరబ్రహ్మేంద్రస్వామి వారి శిలారూపం ఉంది. ఆయనకు దండం పెట్టి, ఇంకా పైకి వెళ్ళి , దర్గాకు చేరాం. అక్కడ నుంచి కిందకు మళ్ళీ అంతదూరం రాలేమంటే, వేరే వైపు , కొండ మీద నుండి, అడ్డదారి లో తీసుకు వచ్చాడు గైడ్.

ఇక ముచ్చటగా మూడోసారి వేణుగోపాల స్వామి టెంపుల్ కి వెళ్ళాం. సగం దూరం కారు వెళ్ళినా, మిగతా దూరం మెట్లు ఎక్కాము. అక్కడ మొదటి సారి గురివింద గింజను, మొక్కను చూశాం. స్వామి పూజ చేసుకుని, హాయిగా ఇంటి కి వచ్చాం .

ఇక వారం రోజులు ఉన్నాయి . రెస్టు కావాలి. నో ట్రెక్కింగ్ అని – తీర్మానించాం. ఇక చూడటానికి ఏమీ లేవు -అన్నారు. మిగిలిన వారం సెలవులు ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడానికి సరిపోయాయని వేరే చెప్పక్కర్లేదు కదా. ఏమైనా నల్గొండ లో మేం చేసిన ట్రెక్కింగ్ సంగతి ఇది .

Report

What do you think?

120 Points
Upvote Downvote

Comments

Leave a Reply

Loading…

Loading…

0

గంగిరెద్దు

The Music World of Telugu Movies