నీరు మహా లక్ష్మి తో సమానం. మహా లక్ష్మి నీటి నుండి ఆవిర్భవించింది.పాలసంద్రం లో శేషతల్పం మీద విష్ణు పాదాల చెంత ఉంటుంది. నీరు ఎక్కువగా పారబోస్తే లక్ష్మి దేవి నిలవదు అని పెద్దలు చెపుతారు.
చిన్నప్పుడు తెగ నీరు పారబోసే వాళ్ళం.కొట్టుడు పంపులు ఉండేవి.భూగర్భ జలాలు ఎక్కువ గా ఉండేవి.అదీకాక కోస్తా జిల్లాల్లో ఉండేవారం. నీటికొరత తెలీదు.
పెద్దైనాక హాస్టల్ లో నీటి విలువ తెలిసి వచ్చింది.రోజూ రెండు పూటలా నీరు పట్టుకుని ,నిల్వ పెట్టుకోవాలి.బకెట్ వాటర్ ఎవరూ వాడకుండా ,రూమ్ లో కి మోసుకోవాలి.బయట ఉంటే జనాలు వాడుతారు అందుకని.
తర్వాత సీమలో, తెలంగాణా లో ఉండటం తో ఇంకా పొదుపు చేయడం మొదలెట్టాము.వేసవిలో ట్యాంక్ లు డబ్బు పెట్టి కొనడం తో ఇంకా జాగ్రత్తగా వాడతాం.
వాన నీరు ఇంకుడు గుంత లో కి మళ్ళిస్తాము. కూరలు కడిగిన నీరు , బియ్యం కడిగి న నీరు,పప్పులు కడిగిన నీరు – వీటిని బకెట్ లో వేసి , చెట్లకు పోస్తాం.
ఇలా వేస్ట్ వాటర్ పోసి పూలను విరిగ బూయిస్తాము.మా పనమ్మాయి మొదట చిరాకు పడేది.మురికి వాసన వస్తున్నాయి అని.కాని పూలను ,ఆకుకూరలను చూసి తను కూడా రెండు కుండీలు తెచ్చుకుని ఉల్లికాడలు, కొత్తిమీర, పుదీనా పెంచడం మొదలెట్టింది. కరోనా రోజుల్లో ఫ్రేష్ గా,ఫ్రీగా , ఆర్గానిక్ ఆకులు తింటుంది.వాళ్ళ షెడ్ పక్కన కుండీలు పెట్టుకుని, పప్పు కడుగు నీరు, బియ్యం కడుగు నీరు డైరెక్ట్ గా పోస్తుంది.
ఆమె ఇంకో రెండు ఇళ్ళల్లో పని చేస్తుంది.వాళ్ళు టీ పొడి పడేస్తుంటే , దీనికి భాదవేసి నా దగ్గర వాపోయింది.కరోనా దెబ్బతో బాల్కనీ లో మొక్కల పెంపకం ఎక్కువైంది.దానిలో వేయబోతే పురుగు లు,ఈగలు వస్తాయని ,వారు వద్దన్నారని,చెత్తలో పడేస్తున్నాని -వాపోయింది.
పోనీ నీవు కవరులో వేసుకుని తెచ్చుకో అన్నాను.ఆ పనే చేస్తాను అన్నది.నీటిని పొదుపు చేస్తే ,చక్కని ఆర్గానిక్ కూరలు వచ్చాయి.కూరల ఖర్చు కలిసి వచ్చింది.
అందుకే పెద్దలమాట చద్దన్నం మూట.నీటిని ఆదా చేస్తే, వేస్ట్ వాటర్ అయినా డబ్బు ఆదా అవుతుంది.నీటిని వ్యర్ధం చేస్తే లక్ష్మి నిలవదు.కాదంటారా?
Comments
Loading…
Loading…