in ,

పిల్లల్ని విసిగిస్తే…

DMDD-ORIG/NAMI

ఏం హెడ్డింగ్ పెట్టారు,మా ఇళ్ళల్లో పిల్లలు విసిగిస్తారు. పిల్లల్ని మేము కూడా విసిగించవచ్చా,ఆ టెక్నిక్ ఏదో చెప్పమని అడుగుతారు.

సాధారణంగా పిల్లలు ఇంట్లో విసిగిస్తూ ఉంటారు. ఖాళీ సమయంలో ,అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళని విసిగిస్తూ ఉంటాను. చిన్నప్పుడు బొమ్మలు కొనిచ్చి ఆడుకోమనేదాన్ని. వంట గిన్నెలు, బిల్డింగ్ బ్లాక్స్-లాంటివి.

వాళ్ళ ఆడుకునేటప్పుడు ,సరదాగా నాకు పప్పు కూర చేసి పెట్టు అనే దాన్ని.దాంతో వాళ్ళు బొమ్మల స్టవ్ మీద కుక్కర్ పెట్టి నట్టు, అది అన్నం వండి ,  పళ్ళెంలో  పప్పు, అన్నం వేసి కలిపి పెట్టినట్టు ,తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు.

నేను ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నట్టు పెట్టుకుని ,యాక్షన్ చేసి ,ఛీ ఉప్పు లేదు అనేదాన్ని. దాంతో వాళ్ళు ఏదో తీసుకొచ్చి వేసినట్టు, చేసే వాళ్ళు .తర్వాత చీ కారం లేదు అనేదాన్ని. దాంతో వాళ్ళు కారం వేసి నట్టు , యాక్షన్ చేసేవాళ్ళు. తర్వాత ముక్కలు బాలేదు, పులుపు లేదు ,నాకేం నచ్చలేదు, నేను తినను అనేదాన్ని.

అంతా చూస్తున్నా మా అమ్మగారు, పాపం పిల్లలు కష్టపడి చేసుకోస్తే ,నీకేం వచ్చిందే ,అలా అన్నావు ,అని నాకు తీసుకువచ్చి పెట్టు,  నేను తింటాను అనేవారు. వాళ్ల సంతోషంగా వెళ్లి ఆవిడకి పెట్టే వారు. ఆవిడ తిన్న ట్లు యాక్షన్, చేసి చాలా బాగుంది, ఇంకా పెట్టమ్మా అంటూ ఉండేవారు.

పిల్లలు కడుపు మంటతో నా దగ్గరికి వచ్చి చూడు ,అమ్మమ్మ ఎంత మెచ్చు కుందో. నీకు వంట చేయడం చేతకాదు, అలాగే రుచి చూడడం కూడా చాతకాదు, అందుకే వంకలు పెట్టావు- అని విసుక్కుంటూ, మా ఆట పాడుచేశావు ,పో అనే వారు.

నేనేం తక్కువ తిన్నానా. నేను కష్టపడి కూర ,పప్పు వండి పెడితే ,అది బాగా లేదని మీరు వంకలు పెడతారు కదా. అలాగే నేను కూడా  పెట్టాను ,తప్పా- అని అడిగాను.

తర్వాత నుంచి మా వాళ్ళు భోజనం బాగా చేశారు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ఆడుతున్నప్పుడు ,వంటలు చేసి తీసుకొస్తే ,ఇది బాగుంది ,ఇది బాగుంది- అని నేను కూడా మెచ్చు కున్నాను.

రాత్రిపూట పడుకునేటప్పుడు తప్పకుండా కథలు కావాలి మా పిల్లలకి .నేను రామాయణం ,భారతం, భాగవతం, పంచతంత్రం ,ప్రపంచంలోనే పేరుగాంచిన వీరులు, భారత సంగ్రామం వీరులు ,రాజుల కథలు- నాకు తెలిసినవన్నీ చెప్పేదాన్ని. చివరి కి అన్ని కథలు అయిపోయినాయి. కొత్త కొత్త కథలు కావాలి -అని అడిగారు .సరే వాళ్ల కోసం కొన్ని సైంటిఫిక్ కథలు క్రియేట్ చేసా. 

(దాన్ని తర్వాత పబ్లిష్ చేయడం, నేను ఒక రచయిత్రి గా మారడం జరిగింది.మత్స్యావతారం, రెక్కలు గుర్రం,దేవకన్య,-కహానియా.కామ్.లో పబ్లిష్ అయినవి.)

కొంతకాలం తర్వాత బాగా అలసి పోయి ,నిద్ర వచ్చేస్తుంది .అప్పుడు మా అమ్మాయి కథ చెప్పవా- అంటూ విసిగించడం మొదలెట్టింది .నేను -ఎప్పుడూ నేనే చెప్పాలా? ఇప్పుడు మీరు చెప్పండి ,నేను వింటాను -అని అడిగాను.

దాంతో మా అబ్బాయి నేను కథ చెప్తాను -అంటూ సరదా పడ్డాడు .వాడుకధ చెబుతున్నాడు, కానీ మా అమ్మాయి కి నచ్చలేదు. కథ అంతా బానే ఉంది. కానీ లాజిక్కు, లింకులు,వర్ణన సరిగా చెప్పలేదు.

దాంతో మా అమ్మాయి నన్ను పీకడం మొదలు పెట్టింది .నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి అని.సరే నని ,నేను వాడు చెప్పిన కథని ,నా స్టైల్ లో, చక్కగా కల్పించుకుని ,చెప్పడం మొదలెట్టాను. వాడంతా వింటున్నాడు. మా అమ్మాయి నా కథనాన్ని ఇష్టపడుతుంది.

కథలో లింకుల కోసం, వాడు చెప్పిన దాన్ని ,నేను కొద్దిగా మార్చాను. కథలో, చాలావరకు లింకులు, నేను కల్పించి చెప్పాను. దాంతో మావాడికి ,ఒళ్ళు మండిపోయింది.ఛీ! నా కథనంతా “పెంట పెంట” చేసి పెట్టావు. నేను ఇంక కధ చెప్పను ,అని అలిగి పడుకున్నాడు.

ఇక నాకు నవ్వు ఆగలేదు. వాడి కథలో వేలు పెట్టి నందుకు ,అదంతా పెంట పెంట అయిపోయిందని -వాడన్న తీరుకి కడుపుబ్బా నవ్వోచ్చింది.

అర్ధరాత్రి అంకమ్మ శివాలు అన్నట్టు- రాత్రి చాలా పొద్దుపోయిన ,ఇంకా నిద్రపోకుండా, ఏంటా నవ్వులు ?అని ఇంట్లో వాళ్ళు కేకలేశారు.దాంతో వాడి డైలాగు చెప్పేటప్పటి కి ,వాళ్ళు రాత్రి మాట మరచిపోయి, పకపకా నవ్వడం మొదలుపెట్టారు.

ఇక మా వాడు కధ తర్వాత చెప్పలేదు, కానీ ఈ సంఘటన మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా ,హాయిగా నవ్వుకుంటా. మా పిల్ల చదువుకుంటున్నప్పుడు, పక్కన కూర్చుంటే ,దానికి కళ్ళు కుడతాయి. దాని పాఠాలన్నీ ,నాకు చెప్పటం మొదలెడుతుంది. అలా పాటలన్నీ విని, విని, నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాను.

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే, అప్పుడప్పుడు పిల్లల్ని విసి గిం చండి ,మీకు కాలక్షేపం అవుతుంది లేదా మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.

(కానీ ఇప్పుడు మా పిల్లలు బాధపడుతున్నారు.అనవసరంగా నీకు టెక్నాలజీ నేర్పించామే – అని.ఎందుకంటే వారి దగ్గర నుంచి సెల్ తీసుకుంటాను,అప్ లో డ్ చేయాలి- అని.ఈ విధంగా కూడా వారిని విసిగిస్తాను.)

Report

What do you think?

Comments

Leave a Reply

Loading…

Loading…

0

నేతి గారెలు

ఏప్రిల్ ఫూల్