in ,

ఒక యోగి ఆత్మకథ

గురువుల సంకల్పం లేనిదే, వారి కరుణ లేనిదే వారిని తెలుసు కోలేము, చదవలేము.

నాన్న గారి కి ట్రాన్స్ ఫర్ అవడంతో కొత్త ఊరు వెళ్ళాం. క్వార్టర్స్ రిపేర్ అంటే గెస్ట్ హౌస్ లో ఉండే వాళ్ళం. ఏమీతోచట్లేదని గోల చేస్తే, ఒక ఆఫీసర్ భార్య -ఒక యోగి ఆత్మ కథ-పుస్తకం ఇచ్చి చదువు, సరదాగా ఉంటుంది, అన్నది.

అహంకారంతో, అజ్ఞానముతో, పుస్తకం చూడగానే చదవబుధ్ధికాలేదు. అందులోనూ 800వందలపైన పేజీలు ఉన్నాయి.

ఆడపిల్లలకు మాత్రమే  జెడ వేసుకునే హక్కు ఉందని, మగవారు జుట్టు పెంచుకో కూడదని ఒక అపోహ. దాంతో ఆ పుస్తకం పక్కన పెట్టేశా. మూడు నెలలు గడిచాక, చదవక పోతే పుస్తకం వాపస్ చేయి, అని నాన్న గారు గట్టి గా చెప్పారు.

మూడు నెలలు పెట్టుకుని, చదవలేదంటే బాధపడతారు, పాపం ఆవిడ ఇచ్చి నందుకైనా చదవాలని మొదలు పెట్టా. ఇకనేను చేసిన తప్పు తెలిసింది.

అద్భుతమైన కధ.గురువులకు నా పై కరుణ కలిగి, నాచే చదివించిన పుస్తకం. తర్వాత అనిపించింది శివుడు జటాజూటధారి. బ్రాహ్మణులు పిలకలు పెట్టు కుంటారు. ఇన్నాళ్ళు అజ్ఞానం తో పుస్తకాన్ని పక్క న పెట్టాను. గురువుల దయ వలన మొదలు పెట్టా. ఇక చివరి వరకు ఏక బిగిన చదివాను.

ముందు యోగానంద బాల్యం లో హిమాలయాల కు పారిపోవడం, వెంటనే పట్టుకుని వెనక్కి తేవడం-ఇలా ఆయన పారిపోవడం, పట్టుబడటం. చివరకు గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం చదువు పూర్తి చేసుకోవడం, విదేశాల్లో ఆధ్యాత్మికతను ప్రచారం చేయడం, ఆయన జీవితం- మొత్తం 800 పైన పేజీలు చదవడమే కాక, ఇంట్లో అందరికీ చెప్పేదాన్ని.

మొత్తానికి ఆశక్తి కరమైన సాహాసాలతో, అధ్బుతంగా ఉంటుంది. అధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారు తప్పక చదవవలసిన పుస్తకం ఇది.

Report

What do you think?

-1 Points
Upvote Downvote

Comments

Leave a Reply

Loading…

Loading…

0

ఏడు తరాలు

వేస్ట్ వాటర్